తెలుగు సంవత్సరాది ఉగాది ఏర్పడిన విధం

ఉగాది ఎలా ఏర్పడినది ? అసలు ఉగాది  అంటే అర్థం ఏమిటి ?
ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఉద్దేశ్యం ఏమిటి ?

ఉగాది  అంటే అర్థం ఏమిటి ?

ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది".'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.

ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది.యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహరించారు.

తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ugaadi meaning

ఉగాది పండుగ ఏర్పడిన విధం:


వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది'  ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.

చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను.
కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచునందని కూడా చెప్పబడుచున్నది.

శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.

ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

పంచాంగ శ్రవణం :

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఉద్దేశ్యం ఏమిటి ?


"
తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌"

తిధి,వార,నక్షత్ర,యోగ,కరణఅములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం.ఉగాది నాడు దేవాలయంలోగాని,గ్రామకూడలి ప్రదేశాల్లోగాని,పండితుల,సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.

"
పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్"

ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉషస్సు లాంటిది ఉగాది  తెలుగు కాల మానమునకు పునాది
ఆచరిస్తున్నాం మరియు అనాదిగా ఆదరిస్తున్నాము హిందువులు

ప్రభవ విభవా ది వత్సరములతో  క్షయ వరకు ఓ కాల చక్రం సూచిస్తే
భూపరిభ్రమనాలతో సూర్యగమనాలతో ఉత్తర దక్షిణ ఆయనములుగా గుర్తించి ఆరు ఋతువులతో ప్రకృతిని అలరిస్తుంది.

చంద్ర బ్రమణాన్ని నక్షత్రముల ఆధారముగా పన్నెండు మాసములుగా గణించి పదునాలుగు తిథులతో శుక్లమందు వృద్ధితో క్రుష్ణమందు క్షీణిస్తూ పక్షములై నిలిచాయి.

ఇరువదేడు నక్షత్రములతో ఇరువదేడు యోగములతో
పదకొండు కరనములతో ఘడియలు, విఘడియలుగా విభజించి
వారములో ఏడురోజులుగా వాసికెక్కి నిలిచినది తెలుగు కాల ప్రమాణము.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరనములె పంచ అంగములని ప్రసిద్ది
గ్రహ సంచార విభజననే రాశులుగా వర్ణించి  కాల గమనమునకు ఉన్న
సంబంధాలు వివరించీదే పంచాంగము.

తిథి వలన సంపదయు, వారము వలన ఆయుష్షు,
నక్షత్రము వలన పాప పరిహారము,యోగము   వలన వ్యాధి నివృతి
కరణము వలన కార్యానుకూలత  కలుగునని పూర్వీకుల నమ్మకము.

కాల గమన ప్రమాణాలు తెలియాలని పంచాంగ శ్రవణం అవశ్యం అన్నారు పెద్దలు.
అందుకే తెలుగు కాల ప్రమాణానికి ఉషస్సు లాంటిది ఉగాది. 

 ఉగాడి పచ్చడి సేవనం:


ఉగదినాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది.వేపపూత,కొత్త చింతపండు,బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు,నేయి,ఉప్పు,మిరియాలు,షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!


ఉగాది పచ్చడి తినడం వలన మనకు కలిగే అద్భుతమైన ఆరోగ్య 

ప్రయోజనాలు కోసం ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్  చేయండి 

                         ఉగాది పచ్చడి పూర్తి వివరాలు 

No comments

Powered by Blogger.