భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? పార్ట్ 1

1 తమిశ్రం: 
చేసిన పాపం : నమ్మిన వారి ధనాన్నిమోసగించి తీసుకోవడం ఇతరుల నుంచి బెదిరించి సొమ్ముని కాచేయడం  ఇతరుల భార్యాపిల్లలను నిర్భందించడం కక్షతో వారిని హింసించడం పెద్దలు పై ఉన్న కక్ష వారి పిల్లలుపై చూపించడం ఇలా చేసినా వారికి ఈ శిక్ష వేస్తారు.

శిక్ష: యమదూతలు కాలపాశంతో కట్టేసి చిమ్మ చీకటిగా ఉండే  నరక కూపం పడేస్తారు . అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతోకాని, కడ్డీతో కాని మెరకు తాళ్ళతో కానీ చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా, చావుకేకలు పెట్టినా పట్టించుకోరు. తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి ఇవ్వకుండా చితకబాదుతారు పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యేవరకు చావబాదుతూనే ఉంటారు.


2. అంథతమిశ్రం:
చేసిన పాపం :  ఒకరినొకరు మోసపుచ్చుకుని స్వార్ధ బుద్దితో నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ నేను భాగుంటే చాలు అని అధిక తిండి తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వెంట్రుకముక్కలో వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు, భర్తకు కూడా ఇక్కడే శిక్షపడుతుంది.

శిక్ష: ఇదో భయంకరమైన చీకటి నరకం. ఇక్కడ కళ్ళు పీకి పడేస్తారు ఏమీ కనబడదు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితకొట్టేస్తారు. ఆ దెబ్బలకు దిమ్మతిరిగిపోయి ఉండగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి ఇందులో పారేస్తారు.


3. రౌరవం: ‘రురు’ అంటే భయంకరమైన “విషనాగు” అని అర్థం.
చేసిన పాపం :  శరీరం శాశ్వతమని తనకోసం, తనవారి కోసం ఇతరుల
ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇతరుల కష్టాన్ని సోమ్ముచేసుకొని అనుభవిన్చేవారిని ఇక్కడికి వస్తారు.


శిక్ష: వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రొమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావేసుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు.4. మహారౌరవం:
చేసిన పాపం :  న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు మంత్ర విద్యలు,క్షుద్ర పూజలు ఇతలులపై ప్రయోగాలుచేసే వారు ఇక్కడకు వస్తారు..

శిక్ష:  వీళ్ళను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటినే ‘క్రవ్యాదులు’ అంటారు. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే, పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి.

5. కుంభిపాకం:
చేసిన పాపం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి, కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.
శిక్ష: ఇక్కడ ఎప్పుడూ సలసలకాగే నూనె ఉంటుంది. అందులో పడేసి వేపుతారు.

6. కాలసూత్రం:
చేసిన పాపం: తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసుడిగిపోయిన పెద్ద వారిని గౌరవించి ఆదరించని వాళ్ళు పెద్దలను జ్ఞానులను అవహేళన చేసేవారు గర్వంతో ఇతరులను కించపరచడం ఇలాంటివారు ఇక్కడకు వస్తారు.
శిక్ష:  
ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద నుండి భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేపెక్కి ఉంటుంది.కూచోడానికి ఉండదు. నుంచోడానికి ఉండదు.
తప్పించుకునే మార్గంలేని ఈ నరకంలో చచ్చేలా పరిగెత్తించి ఆ తర్వాత ఈడ్చి పారేస్తారు.


7. అసిత పత్రవనం: 
చేసిన పాపం: విద్యుత్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్ళన చెడుమార్గంలో పోయేలా చేయడం అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి, ఇదే గొప్ప జీవితం అని వాధించేవాళ్లు కూడా ఈ నరకానికే వస్తారు. 

శిక్ష: కత్తుల్లా మహాపదునుగా ఉండే ముళ్ళచెట్లూ,రాళ్ళూ ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ, పరుగులెత్తిస్తారు. 
ఒళ్ళంతా కోసుకుపోయి, చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు. పాపి స్పృహతప్పి పడిపోతే ఆగి, తెలివి వచ్చాకా మళ్ళీ కొడతారు.
యముడు విధించిన శిక్ష పూర్తయ్యే దాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది.
No comments

Powered by Blogger.