స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న కలియుగ వైకుంఠ శ్రీ వేంకటేశ్వర స్వామివారు

కలియుగ వైకుంఠగా పిలవబడే తిరుమల కొండలలో కొలువైఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారు వారు భక్తుల దర్శనాల సంఖ్యలోను మరియు హుండీ ద్వారా భక్తులు స్వామివారికి సమర్పించుకునే కానుకలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించినాడు.

demat account for lord balaji


అప్పుడప్పుడూ షేర్ల,సర్టిఫికెట్ల రూపంలో స్వామివారి పేరిట రాసి హుండీలో వేసేవారూ ఉంటున్నారు. సర్టిఫికేట్ల రూపంలో వచ్చే ఆ షేర్లను మార్చుకోవడంలో టీటీడీకి (TTD)ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వామివారికి వచ్చే కానుకలు వందల కిలోల్లోనే ఉంటున్నాయి. ఏడాదిగా తిరుమల శ్రీవారి ఆలయం హుండీలో కానుకల రూపంలో వచ్చిన బంగారం టన్నుకు చేరినట్లు సమాచారం. ఈ మొత్తం బంగారాన్ని ఎస్‌బీఐలో (SBI)జమ చేయడానికి అధికారులుతో ఒప్పందం కూడా కుదిరినది. 

ఇంతకాలం శ్రీవారి భక్తులు తమ కానుకలను డబ్బులు రూపంలోనూ,బంగారం(gold),వెండి(silvar) రూపాల్లో మరియు సేవా కార్యక్రమాలుకు విరాళాలుగా ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోరిక మేరకు స్వామివారి పేరుమీద డీమ్యాట్‌ (Demat)అకౌంట్‌ను టీటీడీ(TTD) ఓపెన్‌ చేసింది.

 తిరుమల శ్రీవారి పేరిట స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో (Stock Holding Corporation of India) A/C no: 1601010000384828 తో Demat account ఓపెన్‌ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సీడీఎస్‌ఎల్‌ (CDSL)ఎండీ సీఎస్‌ రెడ్డి ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ అకౌంట్‌ ద్వారా శ్రీవారు స్టాక్‌ మార్కెట్‌లో వాటాదారు కాబోతున్నారు. ఇకపై శ్రీవారి పేరు మీద షేర్లు ఉండబోతున్నాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఇకపై 
షేర్లు,
 సెక్యూరిటీలు,
పేపర్ గోల్డ్(gold)రూపంలో కూడా కానుకలు సమర్పించవచ్చు. .

2 comments:

  1. వడ్డీ కాసుల వాడా మజాకా,బావుంది భాస్కర్ గారు మంచి వ్యాసం

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదములు అశ్వని గారు

      Delete

Powered by Blogger.