పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు. ఎందుకు?


పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలంఅనంటారుఎందుకు?భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలంగా మన హిందూ దేవాలయాలులో స్వామి ,అమ్మవారికి నివేదన చేస్తారు .

 కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. 

జంట అరటిపళ్ళు తినవచ్చా? తినకూదడా? దేవునికి సమర్పించవచ్చా
దీనికి కారణం, 

సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. 
ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంట శ్రేష్ఠం కాదు అని మన పూర్వీకుల అభిప్రాయం .

 కాని,  అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. 
కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండు కాస్తుంది అందుకే మన హిందూ సాంప్రదాయం లో అరటిపండుకు
అంతటి ప్రాదాన్యత ఇస్తారు. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది. –జంట అరటిపళ్ళు తినవచ్చా? తినకూదడా? దేవునికి సమర్పించవచ్చా


దేవునికి ఫలాలను సమర్పించుకుంటుంటాం, 
సాధారణంగా ఫలం అంటే అరటిపండో, మామిడి పండో, ఏదో ఓక పండును సమర్పించడమనే అర్థాన్ని తీసుకొంటారు కొందరు.
 కాని, ఫలం అంటే, దేవుని తలచుకొంటూ ఎంతోకొంత జపం చేస్తూ ఈరోజు జపానికి ఎంతెంత ఫలం అంటే తపః ఫలము వచ్చిందో? 
దానిని భగవంతునికి సమర్పించడమే. అలాంటి తపః ఫలాన్ని దేవునికి సమర్పించాలని శాస్త్రం చెబుతోంది. జంట అరటిపండ్లను దేవునికి అర్పించడం తప్పు అనే విషయం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి జంటగా కలిసిన అరటిపండ్లు ఇచ్చినా దోషం లేదు ...

No comments

Powered by Blogger.