ఉగాది పచ్చడి సేవనం ద్వారా ఆరోగ్య పరమైన ఫలితాలు“అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్”

అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఉగాది అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే ఆరు రుచులతో వైవిధ్యభరితంగా దీన్ని తయారు చేసుకుంటాం. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంలో తయారు చేసే ఈ పచ్చడి సర్వదా ఆరోగ్యదాయకం.ugaadi

ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ తెల్లవారుతో ఖాళీ కడుపుతో  సేవించవలెను. ఉగాడినాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం,పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాడు ప్రభోదాత్మకం కూడా!


"తీపి వెనుక చేదు,పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు,తదితర అనుభూతులు,ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు,దు:ఖానికి క్రుంగకు,సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుంది ఈ ఉగాది పచ్చడి.


వేప పువ్వు:
telugu new year

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వేపపువ్వు బుధుడు కు సంభందించినది . ఇందులో రోగ నిరోధక గుణమున్నది. ఋతుమార్పు వల్ల
పిల్లలకు ఆటలమ్మ(తట్టు),అమ్మవారు,స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. ఒక రకంగా ఇది మన శరీరానికి antivirus protector గా పనిచేస్తుంది .
గుమ్మానికి వేపాకులు కట్టడం వలన కలుషితం లేని స్వచ్చమైన గాలిని పీల్చవచ్చు . వేపపువ్వును పచ్చడిలో వేయడం వల్ల రక్తాన్ని శుద్ధిచేసి వాతపిత్త కఫాన్ని నిర్మూలించే సమవూపకృతి ఏర్పడుతుంది. ఈ శక్తి ఇచ్చేవాడు బుధుడని అంటారు.బెల్లం:       ఇది “గురుగ్రహం” కు చెందిన వస్తువు. దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడతారు. గురుడుపూర్తిగా శుభక్షిగ్రహం కావడం వల్ల కలిసి మెలిసి ఉండే గుణాన్ని మన మనసులో పెంపొందిస్తాడు.మామిడి ముక్కలు:             వీటిలో తీపి, పులుపు గుణాలతో పాటు వగరు గుణముంటుంది. ఈ గుణం శుక్షికునికి ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా ముడుతలు పడకుండా నునువుగా ఉండటానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగులటం వంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో సివిటమిన్ కూడా ఉంటుంది. దీనివల్ల వల్ల  రోగ నిరోధిక శక్తి పెరగడమే కాకుండా చర్మవ్యాధుల రాకుండా నిరోధించుకోగలుగుతాం.


చింతపండు:           పులుపు శుక్షికునిసంకేతం కనుక మామిడి ముక్కలతో కలిసి చింత పులుపు మరింత ఆలోచనా శక్తిని పెంచి, మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్, హడావుడి లేని జీవితాన్ని గడుపగలం. 
ఈ పులుపు వేసవిలోఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకో విశేషం చింతలో ఉన్న సుగుణం ఏమిటంటే చింతను దూరం చేయడమే.
 నిజమే మానసిక అనారోగ్యమున్న వారికి చింతలు పెరగకుండా, మానసిక చాంచల్యాన్ని కలుగకుండా ఉండేందుకు కూడా ప్రతిరోజూ కొద్ది ప్రమాణంలో చింతపండు వాడాలని పెద్దలు సూచిస్తారు.
telugu new year
మిరియాలు:     ఇవి కారపు గుణం కలిగినవి. ఇవి హయక్షిగీవునికి ప్రీతికరమైనవి. ఆలోచనా శక్తిని పెంచుతాయి.


telugu pachadi makingనేతి:
నెయ్యికి అధిపతి చంద్రుడని అంటారు. ఇది మనస్సును ఉత్తేజ పరుస్తుంది, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది.
అరటి: కొన్ని ప్రాంతాలులో అరటిపండు ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో వేస్తారు. అరటిపండు చంద్ర ప్రధానమైన గుణం కలది. అంతేగాక, ఇది శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది. 
making of telugu ugaadi pachadi
చెరుకు: ఉగాది పచ్చడిలో వేసుకునే చెరుకు ముక్కలు కుజునికి సంబంధించినవిగా చెబుతారు. రక్తశుద్ధికి, ఉత్తేజానికి చెరుకులోని పీచుపదార్థం ఉపకరిస్తుంది.sugarcane using in ugaadi pachadi

ఉప్పు, కొబ్బరిముక్కలు: 
ఇవి రెండూ రవి, చంద్రుల లక్షణాలను కలిగి వుంటాయి. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనఃశ్శాంతికి కారణం కావడం వల్ల మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తొలగించడానికి ఇవి రెండు ఎంతగానో సహకరిస్తాయి.
using cococnut making ugaadi pachadi


ఇలా  ఉగాది పచ్చడనే కాదు, మన సంప్రదాయంలోని పండుగలు పర్వదినాల్లో చేసుకునే వంటలన్నీ గ్రహ గమనాలపై ఆధారపడి రూపొందించినవే మన పెద్దలు .

ఉగాది పండుగ ఎలా వచ్చినది ? ఎందుకు జరుపుకుంటారు ??...

No comments

Powered by Blogger.