శ్రీ మహాలక్ష్మి కమలంలో కుర్చుని రెండువైపులా ఏనుగులుతో ఎందుకు ఉంటుంది ??...

శ్రీ మహాలక్ష్మి కమలంలో కుర్చుని రెండువైపులా ఏనుగులుతో  ఎందుకు ఉంటుంది 


“ పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే..
నారాయణ ప్రియేదేవి విష్ణువక్షస్తలాలయే...
క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే..
పాహిమాం కృపయాదేవి సర్వ సంపత్రపదాయినీ ....    ”

లక్ష్మీదేవి యొక్క గుణాలులో దాగిఉన్న రహస్యం :

దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు విష్ణువును వరిచింది లక్ష్మీదేవి ....
సర్వలక్షణసంపన్నురాలు అయిన  ఈ సుదరివతికి  " శ్రీలక్ష్మి "అని  నామకరణం చేసారు .
సమస్త సంపదలకు అధిదేవతను చేసారు.

శ్రీ మహాలక్ష్మి

పాలనురుగు వంటి దేహచాయ , 
త్రిలోకైకసౌందర్యం  ఈమెకు స్వంతం .
ఎప్పుడు  చిరునవ్వు నిండిన ముఖంతో ,
 సర్వాలంకార భూషిత గజరాజుల తోడుగా నాలుగు చేతులతో ,
 కమలాసనంపైన కూర్చుని ఉంటుంది .
చేతులలో ఎటువంటి ఆయుధాలు ఉండవు లక్ష్మీదేవికి ,
ఈమె కలువుపూలు మాత్రమే ధరించి ఉంటుంది.

దేవతలకు 4 చేతులు 8 చేతులు ఉంటుంది అంటే దాని అర్థం దేవతలకు అంతటి శక్తి ఉంటుందని ,లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటే పార్వతీదేవికి 8 చేతులు ఉంటాయి.
 అలా ఎందుకు దేవలతలు అన్ని చేతులు ఉంటాయంటే  డబ్బుకన్నా , విద్యకన్నా , భుజబలం చాలా గొప్పదని అంతరార్థం ...

ధనలక్ష్మికి స్తిరత్వం లేదు . 
ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు,
 లక్ష్మి చెంచల మనస్సు గలది, 
స్థిరమైన జీవితం లేదు ,

అయితే ఎవరిదగ్గర ఆమె ఉంటుందో ఆ ఉన్న 4 రోజులు ఉయ్యాల ఊగిస్తుంది ,
అందరిని అన్నింటిని దాసోహం అని అనిపిస్తుంది .తన శక్తి ఏమిటో చూపిస్తుంది .

అందుకే పెద్దలు  “డబ్బుకు లోకం దాసోహం “ అని ......
“ధనం మూల మిదం జగత్” అని అంటారు.

 లక్ష్మికి నాలుగు చేతులు ఉండడానికి కారణం  ఇదే ...
తన చంచలత్వాన్ని అందరికి తెలియజేయడానికి శ్రీ మహాలక్ష్మి నీటి కొలనులో ఉన్న తామరలో కుర్చుని ఉంటుంది .

నీటిలో ఉన్న కలువపూలు నిశ్చలంగా ఉండదు  చిన్న గాలి వచ్చినా అటు ఇటు ఊగిపోతుంది
కలువపూలు నీటిలో ఉన్నంతవరకు నిగ నిగ లాడిపోతుంది.
నీటినుంచి బయటకి తీయగానే వాడిపోతుంది
 అదేవిధంగా  ధనం  మన దగ్గరున్నంత వరుకు మనకు శక్తి ధైర్యం వస్తుంది బయటకి తీసి ఖర్చుపెడితే మనిషికి శక్తి  తగ్గిపోతుంది భయం వస్తుంది అన్ని విధాలుగా కృంగిపోతారు దరిద్రం వెంటాడుతుంది.

కాబట్టి శ్రీ మహాలక్ష్మికి రెండువైపులా ఏనుగులు ఎందుకు ఉంటాయంటే  ....

గజబలం ఎంతగొప్పదో ధనబలం కూడా ఈ కలియగంలో అంత గొప్పది అని తెలియజేస్తుంది ...
ఒక్క రోజులో వాడిపోయే కలువపూలులో లక్ష్మి ఎందుకు దర్శనం ఇస్తుంది అంటే 
 “ధనం శాశ్వతం కాదు” అని తెలియచెప్పడానికి .

నీటి అలలకు చిన్న గాలికి కూడా కూడా ఊగిపోయే కలువపూలులో లక్ష్మీదేవి ఉండడానికి అర్థం ఏమిటంటే ధనం కూడా నిలకడగా ఎక్కడ ఎవ్వరిదగ్గర ఉండదు అని మనకు తెలియచెప్పడానికి..


మరికొన్నివిశేషాలు ....

No comments

Powered by Blogger.